07-06-2018: అమరావతి: సాంస్కృతికశాఖ పరిధిలో ఉన్న నాటక అకాడమీకి 11 మంది సభ్యులను నియమిస్తూ పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి మీనా ఉత్తర్వులు జారీ చేశారు. నాటక అకాడమీకి గతంలో గుమ్మడి గోపాలకృష్ణను చైర్మన్‌గా, కె.సాంబశివరావును వైస్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ముగ్గురు సభ్యుల కమిటీ సూచనల మేరకు అకాడమీకి మరో 11 మంది సభ్యులను నియమించింది. కె.సత్యంనాయుడు, బి.శ్రీరాములనాయుడు, ఎ.కృష్ణప్రసాద్‌, ఎన్‌.మూలారెడ్డి, బాషా, పి.ఆనందరావు, పి.హరిబాబు, పి.లక్ష్మీకులశేఖర్‌, డి.వెంకటేశ్వరరావు, రవికృష్ణ, డి.హేమ సభ్యులుగా నియమితులయ్యారు.