హైదరాబాద్‌, జనవరి 10(ఆంధ్రజ్యోతి): బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన రచయితలు, కవులు తమ రచనల్ని ముద్రించుకునేందుకు వీలుగా ప్రవేశపెట్టిన కావ్యహిత పథకానికి ఫిబ్రవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిషత్‌ అడ్మినిస్ట్రేటర్‌ కె.చంద్రమోహన్‌ తెలిపారు. ఈ పథకం ద్వారా రచనలు ముద్రించుకోవడానికి గరిష్ఠంగా రూ.50 వేల ఆర్థిక సాయం అంది స్తారు. నివాస, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో కూడిన దరఖాస్తుతో పాటు రచనలకు సంబంధించిన రెండు ప్రతుల్ని తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌ కార్యాలయంలో లేదా admintbspgad@telangana.gov.in మెయిల్‌ ద్వారా ఫిబ్రవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలి.