విజయవాడ, 09-02-2019: సీనియర్‌ జర్నలిస్టు, కవి, రచయిత అరుణ్‌సాగర్‌ సాహితీ పురస్కారం-2018కి ప్రముఖ కవి, విశ్లేషకుడు గుంటూరు లక్ష్మీనరసయ్య ఎంపికయ్యారు. విజయవాడ గవర్నరుపేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రంలో ఆదివారం ఉదయం జరగనున్న అరుణ్‌సాగర్‌ మూడో వర్థంతి సభలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్టు నిర్వాహకులు శ్రీశ్రీవిశ్వేశ్వరరావు, కూనపరాజు కుమార్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.