గుంటూరు(సాంస్కృతికం), జూలై 9: సుప్రసిద్ధ కథా, నవలా రచయిత, విశ్రాంత రైల్వే అధికారి డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు అంత్యక్రియలు ఆదివారం గుంటూరు ఆనందపేటలోని శ్మశానవాటికలో నిర్వహించారు. చంద్రశేఖరరావు శనివారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గుంటూరులోని స్వగృహానికి తరలించిన భౌతికకాయాన్ని ఆదివారం అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌, సంతనూతల పాడు శాసనసభ్యులు ఆదిమూలం సురేష్‌ చంద్రశేఖరరావు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

అరసం నేతలు వల్లూరి శివప్రసాద్‌, డాక్టర్‌ భూసురపల్లి వెంకటేశ్వర్లు, ఎంవీఎస్‌ ప్రసాద్‌, ఎఎంఆర్‌ ఆనంద్‌, విరసం సభ్యులు సీఎ్‌సఆర్‌ ప్రసాద్‌, నల్లూరి రుక్మిణి, అవగాహన కొండా శివరామిరెడ్డి, ప్రజా నాట్యమండలి కార్యదర్శి పీవీ రమణ, లంకా సూర్యనారాయణ, మోదుగుల రవికృష్ణ, కాట్రగడ్డ దయానంద్‌, రావెల సాంబశివరావు, చంద్రశేఖరరావు, సాహితీ వేత్తలు ఖాదర్‌ మొహిద్దీన్‌, బండ్ల మాధవరావు, చోరగుడి జాన్సన్‌, విశ్వేశ్వరరావు, చంద్రలత, ఎస్‌.దేవేంద్రాచారి, ఎన్‌.రవికుమార్‌, కొప్పర్తి వెంకట రమణమూర్తి, శ్రీరామ కవచంసాగర్‌, సీతారామ్‌, కన్నెగంటి రామారావు, విశాలాంధ్ర ప్రచురణాలయం తరపున అక్బర్‌ బాషా, పి.సుధాకర్‌, చంద్రశేఖర్‌ అంతిమయాత్రలో పాల్గొన్నారు.రచనలు-పురస్కారాలుచంద్రశేఖరరావు జీవని, లెనిన్‌ ప్లేస్‌, మాయాలాంతరు, ద్రోహ వృక్షం, చిట్టచివరి రేడియో నాటకం కథా సంపుటాలతోపాటు ఐదు హంసలు, ఆకుపచ్చని దేశం, నల్లిమరియ చెట్టు తదితర నవలలు రచించారు. ఆయన రచించిన జీవని కథ నాటికగా రూపొంది, ఆకాశవాణి జాతీయ స్థాయి పోటీలో మొదటి బహుమతి పొందింది. ఎన్నో సంస్థల నుంచి పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు.