ఒంగోలు, మార్చి 8 : తన రచనలకు గుర్తింపు లేదని ఒక కవి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని కృష్ణా థియే టర్‌ ఎదురుగా ఒగదిలో జరిగింది. మద్దిపాడు మండలం ఇనమనమెళ్లూరు గ్రామానికి చెందిన షేక్‌ రఫీ (45) ఉరివేసుకొని మృతి చెందారు. రఫీ ‘మహర్షి’ అనే కలంపేరుతో కవితలు రాస్తుండేవారు. ఆయనకు ఇం కా వివాహం కాలేదు. తను రాసిన రాతలకు గుర్తింపులేదని మనస్థాపం చెంది స్నేహితుని రూములో ఆత్మహ త్య చేసుకున్నారు. రఫీ కవిత్వం రాసుకుంటూ తన స్నేహితుడు కరిముల్లా ఖాన్‌ రూము తాళం బుధవారం తీసుకున్నాడు. గురువారం సాయంత్రం ఆయ్యే వరకు ఆ గది తలుపులు తీయలేదు. దీంతో ఆనుమానించి గదిలోకి కిటికీ ద్వారా తొంగి చూడగా ఇనపరాడ్డుకు ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. టూటౌన్‌ పోలీసులకు కరిముల్లా ఖాన్‌ సమాచారం ఇవ్వడంతో ఇన్‌స్పెక్టర్‌ సురే్‌ష కుమార్‌ రెడ్డి తన సిబ్బందితో వచ్చి తలుపులు ప గులగొట్టి మృతదేహాన్ని కిందకు దిం చారు. అక్కడ రఫీ ఒక చీటిరాసి పె ట్టాడు. తన మృతదేహాన్ని మీడియా వచ్చేవరకు ఎవరు కదిలించవద్దని తా ను మృతి చెందింది. ప్రపంచానికి తెలిసేవిధంగా ఉండాలని రాసిపెట్టాడు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహన్ని రిమ్స్‌కు తరలించారు.