చాంద్రాయణగుట్ట/హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలంగాణ చరిత్రకారుడు, రచయిత జి.వెంకటరామారావు (84) కన్నుమూశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌ గౌలిపురాలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య అహల్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. సోమవారం మధ్యాహ్నం చాంద్రాయణగుట్టలోని నల్లవాగు శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. 1935 ఫిబ్రవరి 14న జన్మించిన వెంకటరామారావు.. 38ఏళ్లపాటు వివిధహోదాల్లో ప్రభుత్వోద్యోగిగా పనిచేశారు. సుమారు రెండువేలకు పైగా రచనలు చేశారు. ‘పరిష్కారం’ పేరుతో కథానికల సంపుటి, ఆంధ్రప్రదేశ్‌ చర్రితపై నాలుగు గ్రంథాలు రచించారు. తెలంగాణ విద్యా సాంస్కృతిక రంగాల చరిత్ర, ప్రధానిగా పీవీ.. తదితర రచనలు కూడా సాగించారు.