చిక్కడపల్లి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): జీవీఆర్‌-ఆరాధన కల్చరల్‌ ఫౌండేషన్‌, కన్నారంగయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌, గుంటూరు ఆధ్వర్యంలో 27వ తేదీన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యాంకర్‌కు పురస్కార ప్రదానం చేయనున్నారు. ఆరాధన సంస్థ 17వ వార్షికోత్సవం సందర్భంగా టీవీ యాంకర్స్‌ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో భాగంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి యాంకర్‌ దీపా చౌదరికి పురస్కారం ప్రదానం చేస్తామని నిర్వాహకులు గుదిబండి వెంకటరెడ్డి, వీవీ రాఘవరెడ్డి తెలిపారు. మాజీ మంత్రి, కన్నా రంగయ్య చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కన్నా లక్ష్మీనారాయణ అతిథిగా పురస్కారాలను ప్రదానం చేస్తారన్నారు.