చిలకలగూడ, నవంబర్‌ 3(ఆంధ్రజ్యోతి): జ్యోతిష రంగంలో 20సంవత్సరాలుగా విశేషకృషి చేస్తున్న రాళ్లపల్లి రవికుమార్‌కి జ్యోతిష చక్ర వైభవ నిపుణ పురస్కారానికి ఎంపికయ్యారు. లలితాకళా సమాఖ్య  వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు సువర్ణ కంకణం,  అవార్డు ప్రదానం చేయనున్నారు. ఆదివారం ఉదయం 9గంటలకు తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో 18వ వార్షికోత్సవం పురస్కరించుకుని ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.