చిక్కడపల్లి, అక్టోబర్‌ 2(ఆంధ్రజ్యోతి): ఉజ్వల, కురుగంటి కళాక్షేత్రం సంస్థల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి త్యాగరాయగానసభలో ఉజ్వల దసరా పురస్కారాల ప్రదానం జరిగింది. డాక్టర్‌ వలీ మహ్మద్‌కు దసరా పురస్కారాన్ని అతిథిగా పాల్గొన్న సంస్కార ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు ప్రొఫెసర్‌ జ్యోత్స్న తిరునగరి ప్రదానం చేశారు. ఆమె మాట్లాడుతూ అర్హులకు పురస్కారాలు ఇవ్వడం వల్ల వాటికి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. కళా జనార్దనమూర్తి, వసంత్‌ కార్తీక్‌, చిక్కా దేవదాస్‌, ఎం.లక్ష్మి, రాధిక పాల్గొన్నారు.