చిక్కడపల్లి, ఏప్రిల్‌12(ఆంధ్రజ్యోతి): పురస్కారాలు ప్రోత్సాహాన్నిస్తాయని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ శేషశయనారెడ్డి అన్నారు. స్వరసుధాఝరి, త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గానసభలో స్వరసుధాఝరి- ఉగాది పురస్కారాల ప్రదానసభ జరిగింది. ఈ సందర్భంగా  గాయని ఆమని, నృత్యకళాకారిణి రేణుకా ప్రభాకర్‌, రాజకీయ నాయకురాలు రాణీ సుధాకర్‌, గాయని గన్నవరపు లలితలకు పురస్కారాలు ప్రదానం చేశారు.  ఈ కార్యక్రమంలో కళా జనార్దనమూర్తి, డా. చిల్లా రాజశేఖరరెడ్డి, జి. వెంకట్‌రెడ్డి, పండిట్‌ అంజిబాబు, ఎస్‌ బీ సుధాకర్‌, నిర్వాహకులు త్యాగరాజు, పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.