ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కథా రచయిత మాడభూషి రంగాచార్య జ్ఞాపకంగా నెలకొల్పిన మాడభూషి రంగాచార్య స్మారక సంఘం ఆధ్వర్యంలో బాలసాహితీ పురస్కారం, కథల పోటీల్లో విజేతలకు బహుమతులను  ప్రదానం చేశారు. కార్యక్రమం సోమవారం ఓయూలోని నేషనల్‌ బుక్‌ట్రస్టు సమావేశ మందిరంలో జరిగింది. ప్రముఖ కవి, ప్రయోక్త సుఽధామ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సలీం మాడభూషి రంగాచార్య బాలసాహితీ మూర్తి పురస్కారాన్ని ప్రముఖ సాహితీవేత్త శారదా అశోక్‌ వర్దన్‌కు ప్రదానం  చేశారు.  కథలపోటీల్లో విజేతలను బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాడభూషి రంగాచార్య స్మారక సంఘం బుక్‌ట్రస్ట్‌ తెలుగు సంపాదకులు డా.పత్తిపాక మోహన్‌, డా.సిరి, డా.వీఆర్‌.శర్మ, సురేష్‌, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.