విశాఖపట్నం, 07-09-2018: బహుముఖ సాహితీవేత్త బలివాడ కాంతారావు స్మారక జీవన సాహితీ పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ కథా రచయిత, ‘ఆంధ్రజ్యోతి నవ్య’ వారపత్రిక సంపాదకులు జగన్నాథశర్మకు అందజేయనున్నట్టు విశాఖ రచయితల సంఘం కార్యదర్శి రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బలివాడ 91వ జయంతి సందర్భంగా అవార్డును అందజేస్తున్నామన్నారు.