చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా.భానుమతి 94వ జయంతి సందర్భంగా డా.భానుమతి- వంశీ సాహితీ పురస్కారం- 2019ను ప్రముఖ రచయిత్రి బలబద్రపాత్రుని రమణికి ఆదివారం ప్రదానం చేశారు. అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ వంశీ ఇంటర్నేషనల్‌ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని గీతా ఆర్ట్ప్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌ ఈ పురస్కారాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ మా కుటుంబానికి భానుమతి అప్తులని అన్నారు. వంశీ సంస్థ 47సంవత్సరాలుగా చేస్తు న్న కళాసేవ మర్చిపోలేనిదన్నారు. భానుమతి - వంశీ సాహితీ పురస్కారం బలభద్రపాత్రుని రమణికి అందించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. బలభద్రపాత్రుని రమణి మాట్లాడుతూ తనకు ఇలా అవార్డు రావడం.. అల్లు అరవింద్‌ చేతులమీదుగా తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. 50 సంవత్సరాలుగా సాహితీరంగంలో సేవ చేస్తున్న డా. తెన్నేటి సుధాదేవిని అల్లు అరవింద్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో వంశీ సంస్థల అధినేత డా. వంశీ రామరాజు, జానకీదేవి, సత్యవతి పాల్గొన్నారు.