రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఆసక్తితో చదివితే సొంత శక్తితోనే అత్యున్నత స్థాయికి ఎదుగుతారని తూర్పుగోదావరి జిలా కలెక్టర్‌ కార్తికేయమిశ్రా సూచించారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో వారధి ఫౌండేషన్‌ సంస్థ ఆరో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు.  విజేతలకు కండా భీమశంకరం-పాపాయమ్మ స్మారక పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్తికేయమిశ్రా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. విజ్ఞానాన్ని పుస్తకం నుంచే కాకుండా చుట్టూ ఉన్న సమాజం నుంచి కూడా నేర్చుకోవాలన్నారు.    మన చరిత్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఈ పోటీల్లో 41 సెంటర్ల నుంచి 200మంది విద్యార్థులు పాల్గొన్నారు.