హైదరాబాద్‌ సిటీ: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 31వ జాతీయ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనను నగరంలోని కవాడిగూడ, ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈనెల 18 నుంచి 28 వరకు జరిగే ఈ ప్రదర్శనకు దేశ వ్యాప్తంగా 300 మంది ప్రచురణ కర్తలు పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నట్లు కార్యదర్శి చంద్రమోహన్‌ కోయి వివరించారు.