హైదరాబాద్‌, మే10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీ స్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి ‘గవర్నెన్స్‌ విత్‌ ఎ డిఫరెన్స్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. బుధవారం టీపీఎస్‌పీఎస్సీ కార్యా లయంలో సీపీఆర్వో జ్వాలా నర్సింహారావు రచించిన ఈ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీ ఎం తీసుకున్న నిర్ణయాలు,  ముఖ్యమంత్రి ప్రసంగాలు ఉన్నాయి. మొత్తం 67 వ్యాసాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ అకాడ మీ చైర్మన్‌ అల్లం నారాయణ,  బీసీ కమిషన్‌ సభ్యుడు గౌరీ శంక ర్‌, టీయూడబ్లూజే నేతలు క్రాంతి, పల్లె రవి తదితరులు ఉన్నారు.