న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాలో జరగనున్న ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ ఎడిటర్‌ ఎ.కృష్ణారావు పాల్గొననున్నారు. 3 నుంచి రెండ్రోజులపాటు ఆస్ట్రేలియా తెలుగు సంఘం, లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో భారత్‌ నుంచి కృష్ణారావుతోపాటు కేంద్రీయ హిందీసమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొంటున్నారు. ‘‘తెలుగుసాహిత్యం-జర్నలిజం’’ అనే అంశంపై కృష్ణారావు ప్రత్యేక ఉపన్యాసం చేస్తారు.