చిక్కడపల్లి, అక్టోబర్‌ 2(ఆంధ్రజ్యోతి): సప్తస్వర మాలిక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో త్యాగరాయగానసభలో మధురగీతాల సినీ సంగీత విభావరి నిర్వహించారు. గాయకుడు మురళీధర్‌ ఆధ్వర్యంలో పలువురు గాయనీగాయకులు పలు మధురగీతాలు ఆలపించారు. సభలో కళా, సాంస్కృతిక, సాహితీ కార్యక్రమాలకు ఉచితంగా గానసభ మినీ హాళ్ళను ఇస్తున్న గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తిని సంస్థ పక్షాన గాయకుడు చంద్రతేజ సన్మానించారు.