హైదరాబాద్, రవీంద్రభారతి: శాస్త్రీయ నృత్యాలను అద్భుతంగా ప్రదర్శించిన చిన్నారులు రంజింపజేశారు. ఆదివారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరి యంలో శ్రీలహరి క్లాసికల్‌ డాన్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో స్టేట్‌ లెవెల్‌ మ్యూజికల్‌ డాన్స్‌ కాంపిటేషన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సు మారు 30మంది చిన్నారి కళాకారులు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శిం చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ అధినేత్రి లక్ష్మీపార్వతి, డి.వి.ఎస్‌.ఎస్‌.మూర్తి యోగేష్‌, గౌరీ శంకర్‌, మండపాక సురేష్‌, సంధ్యరాణి, శివపార్వతి చిన్నారులను అభినందించారు.