ఆబిడ్స్‌/హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): తెలుగు అకాడమీ పూర్వ సంచాలకులు వెల్చాల కొండల్‌ రావుకు దేవులపల్లి రామానుజరావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి జుర్రు చెన్నయ్య తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 16న సాయంత్ర ం 6 గంటలకు పరిషత్తులో జరిగే సభలో శాంతా బయోటెక్స్‌ అధినేత డాక్టర్‌ వరప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పురస్కారంతో పాటు రూ.25 వేల నగదు, జ్ఞాపిక అందజేస్తారన్నారు.