చిక్కడపల్లి, అక్టోబర్‌ 3 (ఆంధ్రజ్యోతి): డొక్కా సీతమ్మ జయంతి సందర్భంగా శిఖరం ఆర్ట్‌ థియేటర్స్‌, త్యాగరాయగానసభల ఆధ్వర్యంలో స్మారక సేవా పురస్కారాల ప్రదానం జరిగింది. గానసభలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా శంకరం వేదిక కోశాధికారి, సంఘసేవకురాలు యలవర్తి ధనలక్ష్మి, కాచం ఫౌండేషన్‌ అధినేత్రి కాచం సుష్మ, ప్రముఖ కూచిపూడి నృత్యగురువు డా. ఎస్‌పి భారతి తదితరులకు స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, కోటం రాజు కల్యాణ్‌, ప్రవీణ, జి.కృష్ణ తదితరులు  పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ ఆంధ్ర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ అని కొనియాడారు. ఆమె పేరిట పురస్కారాలు ఇవ్వడం ఎంతైనా సముచితంగా ఉందన్నారు.