చిక్కడపల్లి, నవంబర్‌3(ఆంధ్రజ్యోతి): పాట ఈటెకంటే పదునైందని తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు డా. అయాచితం శ్రీధర్‌ అన్నారు. త్యాగరాయగానసభ, కల్యాణి కల్చరల్‌అసోసియేషన్‌, శ్రీకృష్ణమెలోడీస్‌ ఆధ్వర్యంలో నోరి రఘురామమూర్తి రచించిన ‘నేటి నీతి శతకం’  పుస్తకావిష్కరణసభ శనివారం రాత్రి త్యాగరాయగానసభలో జరిగింది. ఈ సందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించిన డా. అయాచితం శ్రీధర్‌ మాట్లాడుతూ పాట ఒక్కసారి వదిలేస్తే హృదయాంతరాల్లోకి వెళ్తుందన్నారు. సంగీతం, గానం తోడైతే పాట అజరామరంగా నిలుస్తుందన్నారు. శతక శిల్పాన్ని అద్భుతంగా పోషించిన వ్యక్తి వేమన అన్నారు. ఈ కార్యక్రమంలో కవి, విమర్శకుడు రమణ వెలమకన్ని, కళా జనార్దనమూర్తి, పొత్తూరిసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.