చిక్కడపల్లి, జూన్‌2(ఆంధ్రజ్యోతి): మనీషా కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా జన్మదినం సందర్భంగా గాయకుడు ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు హోల్డర్‌ మధుబాపు శాస్త్రి నిర్వహించిన ఇళయరాగం- బాపు గానం కార్యక్రమం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. శనివారం రాత్రి త్యాగరాయగానసభలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మధు బాపు శాస్త్రితోపాటు జ్యోతి రామకృష్ణ, రేణుక, అభిఖ్య, దివ్య, సాయికిరణ్‌, షామిలి, రుచిత, అభిలు గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా కార్యక్రమంలో సంఘసేవకుడు డా. ఎ విజయకుమార్‌, సినీ హీరో వి.సాయికిరణ్‌, జ్యోతి రామకృష్ణ, సంకేపల్లి భరత్‌కుమార్‌ శర్మ, త్రినాథరావు తదితరులను నిర్వాహకులు సన్మానించారు. సంస్థ కన్వీనర్‌ వేలూరి రామకృష్ణారావు, పి. మోహన్‌ కుమార్‌గాంధీ తదితరులు పాల్గొన్నారు.