చిక్కడపల్లి, నవంబర్‌4(ఆంధ్రజ్యోతి): మయూరి ఆర్ట్స్‌, సిరిమువ్వ నాట్యనికేతన్‌ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రివరకు  కళా నీరాజనం 2018 నృత్య కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. ఈశ్వర్‌ కూచిపూడి క్షేత్రం(గణపతి), వేదం ఆర్ట్స్‌(భద్రకాళి నృత్యరూపకం), నటరాజ్‌ శంకర్‌ నాట్యకళాఅకాడమీ(కృష్ణలీల), లలిత నృత్య అకాడమీ(పేరిణి జుగల్‌బంది) తదితర సంస్థల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు నిర్వహించి  అలరించారు. ఈ సందర్భంగా జరిగిన సభాకార్యక్రమంలో తెలంగాణ ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి సాయివెంకట్‌,  దైవజ్ఞశర్మ, ఎన్‌ఆర్‌ఐ చెన్నూరి వి. సుబ్బారావు, ఎం గుప్తా, టీవీ, సినీ ఆర్టిస్ట్‌ మల్లిక, హరీష్‌ రవ్వ తదితరులు పాల్గొని కళాకారులను అభినందించారు. నిర్వాహకురాలు మయూరి రాధ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నాట్యగురువు రాధిక, సంతోష్‌, వసుమతి, వాణి, శిరీష తదితరులకు నాట్యమయూరి అవార్డులను ప్రదానం చేశారు.