చిక్కడపల్లి, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): అపర ఘంటసాలగా పేరుగాంచిన భీమవరానికి చెందిన చిప్పాడ నాగేశ్వరరావుకు ఘంటసాల ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు ఆర్థికసాయం అందజేశారు. ఘంటసాల గానగౌతమి సంస్థ అధ్యక్షుడు, గాయకుడు చిప్పాడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం త్యాగరాయగానసభలో ఘంటసాల సినీ సంగీత విభావరి జరిగింది. ఈసందర్భంగా నాగేశ్వరరావుతోపాటు శివలీల, పీవీ శాంతారామ్‌ గీతాలను మధురంగా ఆలపించారు.  అనంతరం జరిగిన సమావేశంలో  చిప్పాడ నాగేశ్వరరావును వంశీ రామరాజు సన్మానించి ప్రతి నెలా అతనికిచ్చే ఆర్థిక సాయం వెయ్యి రూపాయలను పన్నెండు నెలలకు కలిపి ఒకేసారి 12 వేల రూపాయలు, అంతేకాకుండా వంశీ ఆర్ట్‌ థియేటర్‌ తరఫున అతను త్యాగరాయగానసభకు కార్యక్రమం కోసం చెల్లించిన 12,500 రూపాయల అద్దెను మొత్తం 24500 రూపాయల చెక్కును నాగేశ్వరరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో గాయకులు కళ్ళేపల్లి మోహన్‌, అనురాధ, రాఘవాచార్య  పాల్గొన్నారు.