కడప: కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రముఖ కవి, సంపాదకుడు స్వర్గీయ గజ్జెల మల్లారెడ్డి స్మారకార్థం ఇచ్చే సాహితీ పురస్కారం ఇక నుంచి జాతీయ స్థాయిలో ప్రదానం చేస్తున్నట్టు వైస్‌ చాన్సలర్‌ రామచంద్రారెడ్డి గురువారం తెలిపారు. పత్రిక, సాహితీ, సామాజిక రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ఈ పురస్కారానికి 2015-16కు పాత్రికేయుడు తులనేకృష్ణ, 2016-17కు ఇండియాటుడే అసోసియేట్‌ ఎడిటర్‌ రాజేంద్ర, 2017-18కు గాను పాత్రికేయుడు పాలగిరి విశ్వప్రసాద్‌కు పురస్కారం అందజేస్తామన్నారు.