విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఆచార్యులు గారపాటి ఉమామహేశ్వరరావు ఏటా తానా అందించే గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా పురస్కారానికి ఎంపికయ్యారు. విజయవాడ ఐలాపురం హోటల్‌లో శుక్రవారం సాయంత్రం ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అధికార భాషా సంఘం చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ పాల్గొంటారు. తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ పురస్కార ప్రదానం చేయనున్నారు.