చిక్కడపల్లి, మే11 (ఆంధ్రజ్యోతి): ప్రపంచం గర్వింగ దగ్గ తత్వవేత్త, తెలుగుబిడ్డ జిడ్డుకృష్ణమూర్తి  అని తెలంగాణ బీసీ కమిషన్‌సభ్యుడు డా. వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో  శనివారం రాత్రి గానసభలో ప్రముఖ సామాజిక పరివర్తకుడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి సభ జరిగింది. ఈ సందర్భంగా  కృష్ణమోహనరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలతోపాటు సామాజిక పరివర్తకుడిగా, సామాజిక విప్లవానికి నాంది ప్రస్తావన చేసిన గొప్ప వ్యక్తి కృష్ణమూర్తి అన్నారు. కార్యక్రమంలో కళా జనార్దనమూర్తి, బండి శ్రీనివాస్‌, తోట శ్రీలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.