చిక్కడపల్లి, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): బుచ్చిబాబు కథారచయితగా, నవలా రచయితగా గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించారని ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం అన్నారు. నాటక కర్తగా, కథకుడిగా పేరు సంపాదించారన్నారు. గురువారం రాత్రి త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో బుచ్చిబాబు జయంతిసభ  కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది.  ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ తెలుగు రచనల్లో బుచ్చిబాబు అనే కలంపేరుతోనూ, ఆంగ్ల రచనలలో సంతో్‌షకుమార్‌ అన్న పేరుతోనూ రచనలు చేశారన్నారు. ఆయన రచించిన ‘చివరకు మిగిలేది’ అత్యంత పాఠకాదరణ సంపాదించిందన్నారు. సాహితీకిరణం ఎడిటర్‌ పొత్తూరి సుబ్బారావు, చైతన్యకళాసమితి అధ్యక్షుడు భవనాశి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.