రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆచార్య జీవీ.సుబ్రహ్యణ్యం (జీవీఎస్‌)ఆదర్శప్రాయుడని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి అన్నారు. మంగళవారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో ధ్రువం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆచార్య జీవీఎస్‌ సాహితీ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ పురస్కారాన్ని శలాక రఘునాథశర్మకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రమణాచారి శలాక రఘునాథశర్మ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, రాయసం వెంకటరామయ్య, ఆచార్య కాత్యాయనీ విద్మహే, వంశీరామరాజు పాల్గొన్నారు.