పాలమూరులో నేతలు, తారల తళుక్కు

మహబూబ్‌నగర్‌, మార్చి 11: తారలు దిగివచ్చారు.. నేతలు కదిలివచ్చారు.. కాకతీయ కళా పరిషత్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్‌నగర్‌లో హాస్య నటుడు బ్రహ్మానందాన్ని హాస్య నటరత్న బిరుదుతో సత్కరించారు. కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివా్‌సగౌడ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బాబూమోహన్‌, ప్రముఖ సినీ నటి జయప్రద, నటుడు రాజశేఖర్‌, నటి జీవితతో పాటు హాస్య నటులు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకతీయ వైభవాన్ని కళాకారులు కళ్లకు కట్టినట్లు నృత్య రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మధుసూదనాచారి మాట్లాడుతూ కాకతీయ కళా వైభవానికి రాజకీయం లేదన్నారు. కాకతీయులకు మహబూబ్‌నగర్‌ ప్రజలకు అవినాభావ సంబధం ఉన్నదన్నారు.