చిక్కడపల్లి, సెప్టెంబర్‌10(ఆంధ్రజ్యోతి): సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో తనదైన ప్రత్యేకతను ప్రదర్శించిన గొప్ప వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ అని వక్తలు పేర్కొన్నారు. త్యాగరాయగానసభలో సోమవారం రాత్రి కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ జయంతి జరిగింది. ఈ సందర్భంగా సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ఎస్‌బీఐ మాజీ ఏజీఎం త్రినాథరావు తదితరులు ప్రసంగించారు. సంప్రదాయ సాహిత్యానికి పెద్ద దిక్కు అని కొనియాడారు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదన్నారు. గేయం, పద్యం, ముక్తం, మహాకావ్యాన్ని రాసినా విశ్వనాథ కృతిలో ఆయనదైన ఒక వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుందన్నారు. ఏకవీర సినిమాకు ఆయన రచన చేశారన్నారు. ఆయన ఒక మహాకవి అన్నారు. ఈ సమావేశంలో  కొత్త కృష్ణవేణి, బండి శ్రీనివాస్‌, గన్నవరపు లలిత పాల్గొన్నారు.