12-09-2017: కిన్నెర ఆర్ట్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం త్యాగరాయగానసభలోని కళాలలిత కళావేదికలో ప్రముఖ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి రచించిన మూడు నాటికలు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి మాట్లాడుతూ మనసుకు హత్తుకునే నాటికలు ఈ రచనలో ఉన్నాయన్నారు. సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, సినీనటుడు సుబ్బరాయశర్మ, కిన్నెర రఘురామ్‌ పాల్గొన్నారు. ఆవిష్కృత రచనను జి. వెంకటరెడ్డి, వీవీ రాఘవరెడ్డిలకు అంకితం చేశారు.