చిక్కడపల్లి, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): మల్లంపల్లి సోమశేఖర శర్మ చారిత్రక పరిశోధకుడు, సంస్కృతాంధ్ర ప్రాకృత భాషల్లో పండితుడు అని విశ్వసాహితీ అధ్యక్షుడు డాక్టర్‌ బ్రాహ్మణపల్లి జయరాములు అన్నారు. త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గానసభలో ప్రముఖ సాహితీవేత్త మల్లంపల్లి వర్ధంతి సభ జరిగింది. జయరాములు మాట్లాడుతూ లిపిశాస్త్ర నిపుణుడు, శాసన పరిశోధకుడు సోమశేఖర శర్మ అన్నారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో పరిశోధకుడిగా, ఉపన్యాసకుడిగా పనిచేశారని, అనేక చారిత్రక వ్యాసాలు రాశారని వివరించారు. కార్యక్రమంలో కవి తంగిరాల చక్రవర్తి, గాయకుడు రాము పాల్గొన్నారు.