చిక్కడపల్లి, అక్టోబర్‌3(ఆంధ్రజ్యోతి): కళానిలయం, వైఎ్‌సఆర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌, త్యాగరాయగానసభల ఆధ్వర్యంలో తొమ్మిదిరోజులపాటు సాగే శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా సినీ నటి అంజనీరెడ్డిని సన్మానించారు. గురువారం రాత్రి గానసభలో ప్రముఖ సంగీత నృత్యగురువు టీవీ శిరీష(నృత్యాంజలి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కూచిపూడి డ్యాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌) శిష్యబృందం ఆధ్వర్యంలో సంగీత నృత్య కార్యక్రమం జరిగింది. నవరాత్రులు నవగాత్రాలు, నవనాట్యాలు, నవదుర్గలు(మహిళా అతిథులకు సత్కారం)లో భాగంగా సినీ నటి అంజనీరెడ్డితోపాటు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించిన వారిని సినీ, టీవీ నటులు జేఎల్‌ శ్రీనివాస్‌, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి సన్మానించారు. రచయత్రి రత్నామహీధర్‌, నిర్వాహకులు సురేందర్‌, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.