చిక్కడపల్లి, అక్టోబర్‌ 2(ఆంధ్రజ్యోతి): కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బుధవారం రాత్రి త్యాగరాయగానసభలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా సినీ నిర్మాత, దర్శకుడు భీమగాని సుధాకర్‌గౌడ్‌, కళా జనార్దనమూర్తి, నిర్వాహకులు సురేందర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు సినీ నటి శ్రీమణి పర్చాతోపాటు కళాకారులను సన్మానించారు.