పంజాగుట్ట(హైదరాబాద్), ఆగస్టు 18: భాషకు మతాన్ని ముడిపెట్టడం వల్ల ఎంతో నష్టం జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్‌ అన్నారు. మహ్మద్‌  కధీర్‌బాబు, షర్‌ఫలు రాసిన కథామినార్‌ సమకాలిన ముస్లిం నేపథ్య కథలు (2005-2018) పుస్తకావిష్కరణ శనివారం రాత్రి సోమాజిగూడ హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ కవి దేవీప్రియ, ఇందూరు సుధాకర్‌తో కలిసి ఏకే ఖాన్‌ ఆవిష్కరించారు.  అనంతరం ఏకే మాట్లాడుతూ సామాజిక స్పృహతో రచనలు చేయాలన్నారు.  మధ తరగతి ప్రజల ఇతివృత్తాలను తీసుకొని రాసిన కథలు బాగున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చైతన్య పింగళి డాని, పలువురు సాహితీ వేత్తలు పాల్గొన్నారు.