విజయవాడ, 10-02-2019: వికారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా కథానిక పోటీలను నిర్వహిస్తున్నట్టు వైఖానస ప్రభ ఆధ్యాత్మిక మాసపత్రిక సంపాదకుడు వేదాంతం శరశ్చంద్రబాబు తెలిపారు. రచయితలు, రచయిత్రులు పౌరాణిక, చారిత్రక, సాంఘిక నేపథ్యం ఉన్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే కథానిక ఇతివృత్తాలను పంపాలని తెలిపారు. అశ్లీలం, అసభ్యత, అసంగత విషయాలకు రచనలో స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు. రచనలు నాలుగు నుంచి ఆరు పేజీలకు మించకుండా అర్థమయ్యే చేతి రాతతో ఉండాలన్నారు. ప్రథమ బహుమతిగా రూ.4వేలు, ద్వితీయ బహుమతిగా రూ.3500, తృతీయ బహుమతిగా రూ.3వేలుగా నిర్ణయించామన్నారు. మార్చి 25వ తేదీలోగా తమ రచనలను వేదాంతం శరశ్చంద్రబాబు, సాహిత్యవిభాగం సంపాదకులు, ప్లాట్‌ నంబర్‌ 91, శ్రీనివాస నగర్‌ బ్యాంకు కాలనీ, రెండో రోడ్డు, విజయవాడ 520 008 చిరునామాకు పంపాలని తెలిపారు. ఇతర వివరాలకు 0866 - 2480284, 94402 62641 నంబర్లలో సంప్రతించాలని తెలిపారు.