రవీంద్రభారతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిబాఫూలే జీవిత చరిత్రను ఆవిష్కరిస్తూ సాగిన ‘సత్యశోధన’ నాటకం ఆకట్టుకుంది. జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో అభ్యుదయ ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో బహుజన సాంస్కృతిక చైతన్య ఉత్సవాలు శీర్షికన నాటకోత్సవం బుధవారం ప్రారంభమైంది. అతిథులుగా ఎస్సీ డెవలె్‌పమెంట్‌ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్‌, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రోజు యువ దర్శకుడు దేవేంద్ర దర్శకత్వం వహించిన ‘సత్యశోధన’ నాటకాన్ని ప్రదర్శించారు. జ్యోతిబా ఫూలే జీవితంపై సంగీత నృత్యరూపకం ఆకట్టుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన సభలో నటీనటులను సత్కరించి అభినందించారు.