చిక్కడపల్లి, హైదరాబాద్, మార్చి4(ఆంధ్రజ్యోతి): జీవితాన్ని అనుభవించేలా చేసేది కవిత్వమని ప్రముఖ కవి, విమర్శకుడు కె శివారెడ్డి అన్నారు. రవూఫ్‌ రచించిన ఇస్మాయిల్‌ ఇతివృత్త కవితా సంపుటి ‘నది కాలం అతడు’ ఆవిష్కరణ సభ ఆదివారం సాయంత్రం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుడు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా శివారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ఇస్మాయిల్‌ గొప్ప కవి అని అన్నారు. ఈ వేదికపై రవూఫ్‌, ఇస్మాయిల్‌ ఇద్దరి గురించి మాట్లాడుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వాడ్రేవు చినవీరభద్రుడు, డా. శిఖామణి, జి లక్ష్మీనరసయ్య, కవి యాకూబ్‌, ఇస్మాయిల్‌ అల్లుడు అన్వర్‌అలీ దంపతులు పాల్గొన్నారు.