హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రం: పుస్తకాలు పఠించడం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, తద్వారా సమాజంలో జరిగే విషయాలపై సంపూర్ణ అవగాహన ఏర్పడు తుందని ప్రముఖ కవి వాడ్రేవు చినవీరభద్రుడు అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ప్రముఖ రచయిత్రి జ్యోతి నండూరి రచించిన ‘కాలం గీసిన చిత్రం’ కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ప్రముఖ కవయిత్రి శిలాలోలిత అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చిన వీరభద్రుడు కవితా సంపుటిని ఆవిష్కరించారు. సభలో విప్లవ్‌, రమేష్‌ పోతుల, డాక్టర్‌ హరికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.