చిక్కడపల్లి, ఆగస్టు6(ఆంధ్రజ్యోతి): ఈనెల 11వ తేదీ శనివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో కళారంగస్థల సాంస్కృతిక సంస్థ రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఆ సంస్థ గౌరవాధ్యక్షుడు డా. కాచం సత్యనారాయణగుప్తా తెలిపారు.సోమవారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో రజతోత్సవ పోస్టర్‌ను ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మాస్టార్జీతో కలిసి ఆవిష్కరించారు.

 అనంతరం కాచంసత్యనారాయణగుప్తా మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడానికి 25 సంవత్సరాలుగా ఈ సంస్థ కృషి చేస్తోందన్నారు. ఈ వేడుకల్లో తెలంగాణశాసనమండలి చైర్మన్‌ కె. స్వామిగౌడ్‌, ఆచార్య కొలకలూరి ఇనాక్‌, తెలంగాణ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ అధ్యక్షుడు వి. ప్రకాష్‌ తదితరులు పాల్గొంటారన్నారు. పోస్టర్‌ ఆవిష్కరణ లో కళారంగస్థల ప్రఽధానకార్యదర్శి ఏదుల శ్రీనుగౌడ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి జి. శాంతకుమారి, రమేష్‌, సాయి, ప్రవీణ్‌, శ్రీధర్‌, రాజ్‌గోపాల్‌, భూపేష్‌ తదితరులు పాల్గొన్నారు.