వరంగల్‌ కల్చరల్‌, సెప్టెంబరు 7: ‘ప్రజాకవి’ కాళోజీ నారాయణరావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక కాళోజీ పురస్కారం ఈసారి ప్రముఖ నవలాకారుడు అంపశయ్య నవీన్‌కు దక్కింది. రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఆదివారం సాయంత్రం జరిగే కాళోజీ 104వ జయంతి వేడుకలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా రూ.లక్షా 116 నగదుతో నవీన్‌ ఈ అవార్డును అందుకోనున్నారు.