విశాఖ, జూలై 14: గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకం ప్రదర్శన 125 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 26, 27 తేదీల్లో నిర్వహించే ఈ ఉత్సవాలకు విశాఖపట్నం వేదిక కానుంది. ఇందుకు సంబంధించి గోడ పత్రికను శుక్రవారం ఆవిష్కరించారు.