రవీంద్రభారతి, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలలో భాగంగా కీర్తి ఆర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆదివారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు అతిథులుగా మాజీ ఐపీఎస్‌ గోపీనాథ్‌రెడ్డి, ప్రముఖ దర్శకుడు నాగబాల సురే్‌షకుమార్‌, దైవజ్ఞశర్మ, కొత్త కృష్ణవేణి, సుబ్బు కమ్ముల తదితరులు హాజరై పలువురు నాట్య గురువులతో పాటు సేవామూర్తులకు పురస్కారాలను అందజేశారు. ఇందులో భాగంగా పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కీర్తి ఆర్ట్స్‌ అధినేత్రి బిందు లిమ్మా, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.