చిక్కడపల్లి, జూన్‌19(ఆంధ్రజ్యోతి): ఆంధ్ర చారిత్రక నాటక పితామహుడు కోలాచలం శ్రీనివాసరావు అని వక్తలు పేర్కొన్నారు. కోలాచలం శ్రీనివాసరావు శత వర్ధంతి ప్రారంభ సమాలోచనం కార్యక్రమం మంగళవారం త్యాగరాయగానసభలో తెలుగు రథం సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. సీఎ్‌సఆర్‌ కళామందిరం ప్రధాన కార్యదర్శి డా కొట్టె వెంకటాచార్యులు, ప్రముఖ కవి డా. అక్కిరాజు సుందరరామకృష్ణ, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి తదితరులు ప్రసంగించారు. నాటక కర్త, నాటక శాల నిర్మాత, కవి, పరిశోధకుడు, బహుభాషావేత్త, సంఘ సంస్కర్త, తెలుగు సాహిత్యసేవకుడు కోలాచలం శ్రీనివాసరావు అని వారు అన్నారు.  భారతదేశ మొదటి ప్రపంచ నాటక చరిత్ర అత్యుత్తమ విషాదాంత నాటకం రామరాజు చరిత్ర, విజయనగర పతనం రచయిత అన్నారు ఈ సందర్భంగా వెంకటాచార్యులు, సుందరరామకృష్ణలను  సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక సంస్థ అధ్యక్షుడు కొంపెల్ల శర్మ తదితరులు పాల్గొన్నారు.