సంగీత అకాడమీకి వందేమాతరం శ్రీనివాస్‌

అమరావతి, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా ప్రముఖ సాహితీవేత్త కొలకలూరి ఇనాక్‌ ఎంపికయ్యారు. నాలుగు సంస్థలకు చైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేసినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి. గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఇనాక్‌.. సాహితీ రంగంలో చేసిన కృషికి ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా అందుకున్నారు. అలాగే ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివా్‌సను సంగీత నృత్య అకాడమీ చైర్మన్‌గా.. అనంతపురం జిల్లాకు చెందిన పొట్లూరి హరికృష్ణను జానపద కళలు, సృజనాత్మక అకాడమీ చైర్మన్‌గా ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రైస్తవ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుంటూరుకు చెందిన మద్దిరాల జోసెఫ్‌ ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేశారు. ఈ నియామకాలపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎల్‌వీఎ్‌సఆర్‌కే ప్రసాద్‌కు మరోసారి పొడిగింపు ఇచ్చారు.