ఆచార్య కొలకలూరి ఇనాక్‌

గుంటూరు, జులై 14(ఆంధ్రజ్యోతి): ‘‘సుప్రపిద్ధ కథ, నవలా రచయిత డాక్టర్‌ వి.చంద్రశేఖరరావు మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటు. ఆయన మరణంలోని రణాన్ని కొనసాగిస్తూ దుఃఖ రహిత సమాజం కోసం పాటు పడదాం’’ అని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. గుంటూరులో శుక్రవారం జరిగిన కథా రచయిత చంద్రశేఖరరావు సంస్మరణ సభలో పలువురు వక్తలు ప్రసంగించారు. ఆచార్య కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ సంక్లిష్ట దశలో ఉన్న సమాజంలోని సంఘటనలను ఒడిసి పట్టి తెలుగు పాఠకుల ముందుంచిన మహోన్నత వ్యక్తి చంద్రశేఖర్‌ అని కొనియాడారు. సభకు అధ్యక్షత వహించిన పెనుకొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చంద్రశేఖరరావు రచించిన జీవని కథ రేడియో నాటికగా రూపొంది ఆకాశవాణి జాతీయస్థాయి పొటీల్లో ప్రథమ బహుమతి పొందిందని గుర్తు చేశారు.