ఫేస్‌బుక్‌ వేదికగా ‘కవిసమ్మేళనం సాహిత్య వేదిక’ స్థాపించిన కొత్తపల్లి నరేంద్ర బాబు మరణించారు. ప్రతి యేటా వారి పేరుతో ఇవ్వనున్న పురస్కారానికి 2016-2017 సంవత్స రాలలో వచ్చిన కవిత్వ సంపుటాలను ఆహ్వానిస్తున్నాం. జనవరి 31లోగా నాలుగు ప్రతులను: కొత్తపల్లి సురేష్‌ (అక్షర మాలి), ఇం.నెం.6-1-149-1, జన్మ భూమి రోడ్డు, లక్ష్మీనగర్‌, అనంతపురం-515001కు పంపాలి. విజేతలకు ఫిబ్రవరి రెండవ వారంలో బహుమతి ఉంటుంది.

- కవిసమ్మేళనం సాహిత్య వేదిక