హయత్‌నగర్‌,అక్టోబర్‌ 3(ఆంధ్రజ్యోతి): పలుమార్లు రక్తదానం చేయడం, వివిధ పాఠశాలల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్న యువ వైద్యుడు డాక్టర్‌ మార్కండేయులుకు గాంధీ జయంతిని పురస్కరించుకుని బుధవారం కుంట్లూర్‌ వంశీ వేగేశ్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ- వంశీ విశిష్ట సేవా పురస్కారాన్ని ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు వంశీరామరాజు అందజేశారు. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ మార్కండేయులు 101సార్లు రక్తదానం చేశారని గుర్తు చేశారు. అదే వి ధంగా వివిధ పాఠశాలల్లో, ఖాళీ ప్రదేశాలలో వేలాది మొక్కలు నాటిన గొప్ప వ్యక్తి ఆయన అని కొని యాడారు. ఈ కార్యక్రమంలో సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, కృష్ణాది శేషు, డాక్టర్‌ అన్నపూర్ణ, డాక్టర్‌ జ్యోత్స్న వీబీ గాంధీ, అల్లాడి పరమేశ్వర్‌, రవికుమార్‌, మోహన్‌రెడ్డి, సుంకరపల్లి శైలజ, బాలత్రిపుర సుందరి తదితరులు పాల్గొన్నారు.